LATEST NEWS FROM AALOCHANA


మంథని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రము. ఇది కరీంనగర్ నుండి 60 కి.మీ.ల దూరములో, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 225 కి.మీ.ల దూరములో ఉన్నది. ఈ చిన్న గ్రామము వేద బ్రాహ్మణులతో మరియు దేవాలయములతో నిండి ఉన్నది.


భౌగోళికంగా, మంథని 18-30' మరియు 19' ఉత్తర అక్షాంశాల మధ్యా, 78-30' మరియు 80-30' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి సముద్ర మట్టమునకు 421 అడుగులు(128 మీటర్లు) ఎత్తులో ఉన్నది.


మంథనికి ఉత్తరాన గోదావరి నది, దక్షిణాన బొక్కలవాగు అనే చిన్న యేరు, తూర్పున సురక్షిత అడవి, పశ్చిమాన రావులచెరువు హద్దులుగా ఉన్నవి. దక్షిణాన మరియు పశ్చిమాన గ్రామ వ్యవసాయ భూములు ఈ పొలిమేరలకు ఆవల ఉన్నా ప్రధాననివాస స్థలము ఈ హద్దులలోనే ఉన్నది. గ్రామ విస్తీర్ణము కేవలము 6 చదరపు కిలోమీటర్లు మాత్రమే.

0 comments: